Top Ten News @ 5 PM

తాజా వార్తలు

Updated : 19/07/2021 17:06 IST

Top Ten News @ 5 PM

1. AP News: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌ వే పనుల ఛాయా చిత్రాలను జగన్‌ పరిశీలించారు.

2. భూములు కట్టబెట్టడం కొనసాగుతోంది: రేవంత్‌

గతంలో ఐటీ పార్కుల పేరిట బెదిరించి భూములు లాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ తన బంధువులకు భూములు కట్టబెట్టడం కొనసాగుతోందని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఔటర్‌ రింగ్‌రోడ్డును అధికారులు ఇష్టారీతిన మార్చారని అన్నారు.

3. ఓటమి భయంతోనే తెరాస గూండాగిరీ: ఈటల 

ఓడిపోతామనే భయంతోనే హుజూరాబాద్‌లో తెరాస గూండాగిరీ చేస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజూరాబాద్‌ నుంచే మొదలవుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగనున్న తన ప్రజా జీవనయాత్ర కమలాపూర్‌ మండలం బత్తివానిపల్లి నుంచి ఈటల ప్రారంభించారు. 

4. అలాగైతే మహోద్యమం తప్పదు: లోకేశ్‌

నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వైకాపా రాజకీయ నిరుద్యోగులకు జగన్‌ ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులతో యువతను అడ్డుకోవాలనుకోవడం అసాధ్యమని ఆయన తెలిపారు.

5. మళ్లీ సిక్సర్‌ కొట్టిన సిద్ధూ! 

అది క్రికెట్‌ మైదానం అయినా.. టీవీ షో అయినా.. రాజకీయాలైనా.. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అలియాస్‌ ‘సిక్సర్‌ సిద్ధూ’ క్యారెక్టర్‌ ఒక్కటే. గ్రౌండ్‌లో సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తడం సహా రాజకీయ జీవితంలో తన పదునైన పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకుని విమర్శకులను విస్మయానికి గురిచేయడంలో ఆయనకు ఆయనే సాటి. చురుకైన స్వభావం, దూకుడు మనస్తత్వంతో క్రికెటర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన సిద్ధూ.. ఇప్పుడు పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

6. దేశంపై బురద జల్లేందుకు విదేశీ నిధులతో కుట్ర

దేశాన్ని, నరేంద్రమోదీ సర్కారును అప్రతిష్ఠ పాల్జేసేందుకు ఒక వార్తా వెబ్‌సైట్‌కు విదేశాల నుంచి అనుమానాస్పద రీతిలో నిధులు అందుతున్నాయని భాజపా ఆరోపించింది. దేశ వ్యతిరేక శక్తులు విదేశీ శక్తులతో కుమ్మక్కు అవుతున్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘‘న్యూస్‌క్లిక్‌ అనే పోర్టల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరిపినప్పుడు రూ.9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) విషయం బయటపడింది.

7. Delta Variant: 80శాతం కేసులకు ఇదే కారణం..!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తుపానులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా నమోదైన 80శాతం పాజిటివ్‌ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకానికి 40 నుంచి 60శాతం అధికంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉందని తెలిపారు. 
8.
Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు

 దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కుంగదీశాయి. దీంతో ఆర్థికం, బ్యాంకింగ్‌, లోహ, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడం సూచీలపై ప్రభావం చూపింది.

9. Narappa: ఓటీటీ రిలీజ్‌ బాధగా ఉంది

కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ వంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు తెరకెక్కించి ఫ్యామిలీ డైరెక్టర్‌గా ప్రేక్షకులకు చేరువయ్యారు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పటివరకూ తెరకెక్కించిన వాటికి విభిన్నంగా మొదటిసారి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్‌లో ఆయన రూపొందించిన చిత్రం ‘నారప్ప’. వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘నారప్ప’ విడుదలపై ఎన్నో సరదా సంగతులను ఆయన విలేకర్లతో పంచుకున్నారు.

10. Cricket: ఇషాన్‌ సిక్స్ వెనుక సీక్రెట్‌ ఇదే!

సంజు శాంసన్ గాయంతో వన్డే అరంగేట్రానికి అవకాశం దక్కించుకున్న వికేట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసిన భారత యువ జట్టులో ఇషాన్‌ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. తన కంటే ముందు పృథ్వీ షా పారించిన పరుగుల వరదను నిరాటంకంగా కొనసాగించాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి.. తర్వాత బంతిని బౌండరీలోకి బాది క్రీజులో కుదురుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని