Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 10/09/2021 09:10 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కరోనా నివారణకు చీమల పచ్చడిని సిఫార్సు చేయలేం

కరోనా నివారణకు సంప్రదాయ వైద్యమైన ఎర్ర చీమల పచ్చడిని ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని, కరోనా నివారణకు దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్‌ పఢియాల్‌ దావా వేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు దీన్ని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Coronavirus: చిన్నారుల్లోనూ ‘లాంగ్‌ కొవిడ్‌’

2. సొంతమా.. సమమా!

ఒకవైపు గత టెస్టు విజయం ఇచ్చిన ఆనందంలో సిరీస్‌ కూడా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్‌... మరోవైపు ఓటమిని మరిచి సిరీస్‌ సమం చేయాలనే కసితో ఇంగ్లాండ్‌! ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్‌లో చివరిదైన అయిదో టెస్టు నేటి నుంచే. కానీ మ్యాచ్‌కు కరోనా సెగ తగిలింది. భారత జట్టు జూనియర్‌ ఫిజియోకు పాజిటివ్‌ రావడంతో ఓ దశలో మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు తలెత్తాయి. కానీ ఆటగాళ్లందరికీ నెగెటివ్‌ రావడంతో మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విమాన సర్వీసింగ్‌ కేంద్రాలుగా బేగంపేట, తిరుపతి

 భారత్‌ను విమాన నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌వో) కేంద్రంగా మార్చేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేట, తిరుపతి, భోపాల్‌, చెన్నై, దిల్లీ, ముంబయిలోని జుహూ, కోల్‌కతా విమానాశ్రయాలను ఎంఆర్‌వో కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Tuck Jagadish Review: రివ్యూ: టక్‌ జగదీష్‌

‘టక్‌ జగదీష్‌’ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. ఇందులో నటులు మారారంతే. టక్‌ జగదీష్‌ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Thalaivii Movie Review: రివ్యూ: ‘తలైవి’

5. Pawan Kalyan: అమ్మ పెట్టదు... అడుక్కు తిననివ్వదు

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ‘‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’’ అన్నట్లుగా తయారైందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు, కాట్నం బాలగంగాధర్‌ తిలక్‌, లోక్‌సత్తా నాయకుడు అశోక్‌కుమార్‌లు నివేదిక విడుదల చేశారు. సంబంధిత వార్తను ఈనాడు.నెట్‌లో ప్రచురించగా... దాన్ని ట్యాగ్‌ చేస్తూ పవన్‌కల్యాణ్‌ ఈ వ్యాఖ్య చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆభరణాలు ధరించకూడదు

అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యవిద్యలో ప్రవేశాలకు ఈ నెల 12న(ఆదివారం) పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హయత్‌నగర్‌ పట్టణాల్లో నీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సొంతింటి విఘ్నాలు తొలగినట్టేనా?

ఇల్లు, స్థలం కొనుగోలు చేసేందుకు చాలామంది మంచి రోజు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజూ రానే వచ్చింది. విఘ్నాలు తొలగించే పండగగా జరుపుకొనే వినాయక చవితి వేళ సొంతింటిపై నిర్ణయం తీసుకునేందుకు సరైన సమయమని చాలామంది భావిస్తుంటారు. విక్రయాలు పెంచుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పండగపూట పలు ఆఫర్లు అందిస్తున్నాయి. పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులు మొదలెడుతున్నాయి. ఇటు కొనుగోలుదారులకు, అటు డెవలపర్లకు పండగ కలిసొస్తుందని విశ్వాసంతో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వినాయకుడు చెప్పే ఆర్థిక పాఠాలు

8. ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌.. ఉద్యోగం.. స్వీపర్‌

జీవితం వడ్డించిన విస్తరి కాదు. సామాన్యులకైతే అసలే కాదు. ఇష్టాలను కష్టాలు కబళిస్తాయి. లక్ష్యాలకు బాధ్యతలు అడ్డుపడతాయి. ప్రయత్నాలు గురి తప్పుతాయి. పరిస్థితులతో రాజీపడి బతుకు బండిని లాగాల్సి వస్తుంది. ఈ మహిళ గాథ అలాంటిదే. ఆమె ఎన్నో కలలు కన్నారు. డాక్టరు కావాలన్న కోరికతో శ్రద్ధగా చదివారు. పీజీ వరకు ఆటంకాలు లేకుండా చక్కటి మార్కులతో దూసుకెళ్లారు. తర్వాత పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేను అందరి కన్నా చిన్నోచ్‌!

‘వేలెడంత లేవు.. కానీ ఎంత అల్లరి చేస్తున్నావో?’ అని మిమ్మల్ని ఇంట్లో అమ్మానాన్న అప్పుడప్పుడు అంటుంటారు కదూ! మీలో గడుసు వాళ్లు ఉంటే.. ‘నేను వేలు కన్నా పెద్దగానే ఉన్నా.. కావాలంటే చూసుకో..!’ అని సమాధానం ఇస్తారు. కానీ నేను మాత్రం అలా చెప్పుకోలేను. ఎందుకంటే.. నేను కనీసం వేలెడంత కూడా ఉండను మరి. మహా అయితే గోరంత ఉంటానేమో..! ఇంతకీ నేనేవరంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బరి తెగించిన మానవ మృగాలు

గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. నగరానికి 28 కి.మీ దూరంలో.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వైవాహిక యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొట్టి చిత్రహింసల పాల్జేశారు. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక అనుమానాస్పద మృతి.. స్థానికుల ఆందోళన


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని