Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 15/09/2021 09:09 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఐఫోన్‌ 13 వచ్చేసింది

యాపిల్‌ సరికొత్త 5జీ ఐఫోన్‌ 13 సిరీస్‌ను ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులోనూ వీటిని తీసుకొచ్చింది. కెమేరా లెన్స్‌లను ఐ మూలగా ఏర్పాటు చేసి ఫోన్‌ వెనక భాగానికి కొత్త రూపు తెచ్చింది. ఫేస్‌ ఐడీ సెన్సర్లను తక్కువ స్థలంలో అమర్చింది. ఫోన్‌ కెమేరాలో కొత్తగా సినిమాటిక్‌ మోడ్‌ ఉంది. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌లో షూట్‌ చేయవచ్చు. మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌నూ ఇవి సపోర్ట్‌ చేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ 2021 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్‌ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తప్పు చేశా... బాధపడుతున్నా...

3. బియ్యం కార్డుల వడపోత

బియ్యం కార్డుల వడపోత దిశగా పౌరసరఫరాల శాఖ... చర్యలు ముమ్మరం చేసింది. ఇటీవలి వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రేషన్‌ తీసుకుంటున్న వారిపై దృష్టి పెట్టిన అధికారులు... ఇప్పుడు బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టారు. వరసగా మూడు నెలలకుపైగా రేషన్‌ తీసుకోని కార్డుల సంగతేంటో తేల్చాలని మండలాలకు జాబితాలను పంపారు. గ్రామాల వారీగా వీటి పరిశీలన మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Supreme Court: దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు: సుప్రీంకోర్టు తీర్పు

దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విదేశాల చేతికి దేశ రక్షణ రహస్యాలు?

5. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌?

పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పెట్రో’పై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావొచ్చు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐసీయూలో చేర్చాలి.. అంతా దోచాలి

రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అధిక బిల్లులతో రోగులను బెంబేలెత్తిస్తున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా లేకపోయినా.. నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్లేట్‌లెట్లు లక్షలో ఉన్నా ఐసీయూలో చేర్పిస్తూ.. అవసరం లేకపోయినా వాటిని ఎక్కిస్తూ.. రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుడి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వైర్‌లెస్‌ విద్యుత్తు

వీధుల్లో విద్యుత్‌ స్తంభాలు, తీగలేవీ లేవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్‌ టవర్లేవీ లేవు. అయినా ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులీనుతూనే ఉన్నాయి. ఫ్రిజ్‌, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. మరి అదే నిజమైతే? వైర్‌లెస్‌ విద్యుత్తు పంపిణీ పరిజ్ఞానంతో ఇది సాకారమయ్యే రోజులు మరెంతో దూరంలో లేవు. తీగలు లేని విద్యుత్తు అనగానే సైన్స్‌ ఫిక్షన్‌ కథ గుర్తుకురావొచ్చు. కానీ ఇదేమీ కాల్పనిక కథ కాదు. ఇది సాధ్యమేనని నిరూపితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భూ లయ 2.75 కోట్ల ఏళ్లకోసారి!

8. IPL 2021: అప్పుడు హిట్‌ బౌలర్‌.. ఇప్పుడు నెట్‌ బౌలర్‌!

షెల్డన్‌ కాట్రెల్‌.. పంజాబ్‌ కింగ్స్‌ గతేడాది ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ.8.5 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్న వెస్టిండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో కాట్రెల్‌ను ఈసారి ఫ్రాంఛైజీ వదులుకుంది. వేలంలో అతడిని కొనేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఆడే విండీస్‌ జట్టులో రిజర్వ్‌ ఆటగాడిగాగా ఎంపికైన ఈ పేసర్‌.. ఈనెల 19న యూఏఈలో ఆరంభం కాబోతున్న ఐపీఎల్‌ రెండో దశ టోర్నీలో నెట్‌ బౌలర్‌గా సేవలందించనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నడవలేనోడు తిరగబడ్డాడా?

సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న నా భర్త పోలీసులపై ఎలా తిరగబడతాడు..? అని చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ మృతుడు చెన్నకేశవులు భార్య ప్రశ్నించారు. త్రిసభ్య కమిషన్‌ విచారణలో భాగంగా మంగళవారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ‘దిశ’ హత్య కేసులో తన భర్తను పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత జైలులో పలుమార్లు కిందపడిపోయాడన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘మగ’పుటేనుగులు

10. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని