నల్గొండ కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణ

తాజా వార్తలు

Updated : 07/04/2021 16:37 IST

నల్గొండ కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణ

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, విశ్రాంత పౌర సరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణి కోర్టు ధిక్కరణ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటల పాటు గడపాలని చెప్పింది. ఆరునెలల పాటు సేవ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని సంధ్యారాణిని హైకోర్టు ఆదేశించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఇద్దరికి రూ.2వేల జరిమానా విధించారు. ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ధర్మాసనం ఎదుట అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం..
సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుపైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వీరారెడ్డి, ఆర్డీవో, తహసీల్దార్‌పై దాఖలైన ధిక్కరణ కేసుల వివరాలను అందజేయాలని రిజిస్ట్రార్‌ను న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ధిక్కరణ శిక్ష పడితే.. అప్పీల్‌ చేస్తే చాలని భావిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులకే ముగ్గురు జడ్జిలను పెట్టాల్సి వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని