ఆ విచారణలో మేం జోక్యం చేసుకోలేం: హైకోర్టు

తాజా వార్తలు

Published : 04/02/2021 20:00 IST

ఆ విచారణలో మేం జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్‌: ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసులపై సత్వర విచారణ జరపాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సిబ్బందిని నియమించడంతో పాటు సాక్షుల విచారణ ప్రక్రియ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున అక్కడే ప్రస్తావించాలని సూచించిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌పై విచారణను ముగించింది.

ఇవీ చదవండి..

నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యం

చివరి నిమిషం వరకు ప్రయత్నించారు: నిమ్మగడ్డ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని