తిరుమల వచ్చే భక్తులపై తితిదే ఆంక్షలు 

తాజా వార్తలు

Published : 30/03/2021 01:19 IST

తిరుమల వచ్చే భక్తులపై తితిదే ఆంక్షలు 

తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు తిరుమల వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. నడకదారి భక్తులకు ముందురోజు ఉదయం 9గంటల నుంచి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, వాహనాల్లో వచ్చేవారికి ముందురోజు మధ్యాహ్నం  1నుంచి అనుమతిస్తామని స్పష్టంచేశారు. మరోవైపు, రాష్ట్రంలో తాజా కరోనా కేసుల్లో అత్యధికంగా 181 కొత్త కేసులు చిత్తూరు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని