జూమ్‌ జూమ్‌ మాయ

తాజా వార్తలు

Updated : 19/07/2021 17:13 IST

జూమ్‌ జూమ్‌ మాయ

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి మీటింగులు జూమ్‌, స్కైప్‌, గూగుల్‌ డుయో వంటి అప్లికేషన్లలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్నాయి. ఈ యాప్స్‌ వినియోగం పెరగడంతో వాటిల్లోని కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైన ఫీచర్‌ వీడియో కాల్‌లో ఉన్నపుడు బ్యాక్‌గ్రౌండ్‌ మార్చుకోవడం. ఈ ఫీచర్‌ను ఉపయోగించి అమెరికాలో చట్టసభసభ్యుడు చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని ఓహయో రాష్ట్ర చట్టసభ్యుడు ఆండ్రూ బ్రెన్నర్‌ జూమ్‌ వేదికగా  ఓ సమావేశానికి హాజరయ్యారు. కారు డ్రైవ్‌ చేస్తూ మిగిలిన  సభ్యులకు ఆ విషయం తెలియనీయకుండా ఇంటి ఫోటోను బ్యాక్‌గ్రౌండ్‌ పెట్టి కవర్‌ చేశారు. కానీ, డ్రైవింగ్‌లో మాటి మాటికీ తలతిప్పడం, సీటు బెల్టు కనిపించడం వల్ల అసలు నిజం తెలిసిపోయింది. ఇంత వరకూ బాగానే ఉంది కదా! ఆయన ఎందుకు చిక్కుల్లో పడ్డారంటే.. ఓహయో రాష్ట్రంలో ప్రమాదకర డ్రైవింగ్‌ను నిషేధిస్తూ బిల్లు ప్రవేశ పెట్టిన రోజే ఆండ్రూ బ్రెన్నర్‌ ఈ ఘనకార్యం చేశారు. అదన్నమాట సంగతి!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని