కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

తాజా వార్తలు

Updated : 18/03/2021 05:04 IST

కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

ఫ్లోరిడా: కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న వేళ మానవాళికి తీపికబురు. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు పెట్టింది. కొవిడ్ టీకా (మోడెర్నా) తీసుకున్న ఆరోగ్య కార్యకర్త ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఒకామె 36 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు కొవిడ్ టీకా తీసుకున్నారు. మూడు వారాల తర్వాత జనవరిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ఈ పరిశోధనలో శిశువులో కొవిడ్ యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించామని అక్కడి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ గిల్‌బర్ట్‌ పేర్కొన్నారు. కొవిడ్ టీకా తీసుకున్న గర్భిణిలోనే కాక ఆమెకు జన్మించిన బిడ్డలోనూ యాంటీ బాడీలు వృద్ధి చెందాయని గిల్‌బర్ట్‌ వివరించారు. ఇటువంటి ఘటన ప్రపంచంలో తొలిసారిగా జరిగిందని చెప్పారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యుడు డాక్టర్‌ చాడ్‌ రుడ్నిక్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని