‘పడకల్లేవు.. కాసేపు ఆగండి’.. అంతటా ఇదే దుస్థితి

తాజా వార్తలు

Updated : 26/04/2021 11:29 IST

‘పడకల్లేవు.. కాసేపు ఆగండి’.. అంతటా ఇదే దుస్థితి

ప్రభుత్వాసుపత్రుల వద్ద హృదయవిదారక దృశ్యాలు

అమరావతి: కరోనా బాధితులు, బంధువులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆప్తులను కోల్పోయినవారి ఆవేదనలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు నిత్యకృత్యమయ్యాయి. తమ కళ్లముందే అయినవారు అనంతలోకాలకు వెళ్లిపోతుంటే ఏమీ చేయలేని దీన స్థితిలో వారు పడే ఆవేదన చూస్తే కళ్లు చెమర్చకమానవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు రోగులను ఒకే స్ట్రెచర్‌పై కూర్చోబెట్టి తీసుకెళుతున్నారు. స్ట్రెచర్‌లు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. సిబ్బంది మాత్రం వాటిపై ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకెళ్లడం అక్కడివారిని బాధించింది. అనేక మంది రోగులు పడకల కోసం ఆంబులెన్స్‌లోనే ఆక్సిజన్‌ సిలిండర్లతో ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొంది. రోగులు కన్నీళ్లు పెట్టినా, గగ్గోలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా.. వారికి దొరికే సమాధానం ఒకటే.. ‘పడకల్లేవు. కాసేపు ఆగండి’. ఈ తరహా పరిస్థితులు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద సర్వసాధారణమయ్యాయి.

రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి అయిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడ కేటాయించిన పడకలు సరిపోక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగుల సంఖ్యకు తగినట్లు పడకలు పెంచి ప్రాణాలు కాపాడమని బాధితులు, వారి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని