ఉద్ధృతమవుతోన్న ఉక్కు కార్మికుల పోరాటం 

తాజా వార్తలు

Updated : 10/07/2021 13:21 IST

ఉద్ధృతమవుతోన్న ఉక్కు కార్మికుల పోరాటం 

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికుల చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఇందులో కార్మికులు డిమాండ్‌ చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా లావాదేవీల, న్యాయ సలహాదారుల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం.
కీలకమైన వీరి నియామకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్లో ముందు నిలిచిన వారికి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగిస్తారు. ఒకవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం ఇలా ముందడుగు వేస్తుండటంపై కార్మికులు నిరసనను తీవ్రతరం చేస్తున్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని