పెళ్లి పెద్దలకు కప్పగంతుల తాంబూలం

తాజా వార్తలు

Published : 20/05/2021 20:26 IST

పెళ్లి పెద్దలకు కప్పగంతుల తాంబూలం

ఇంటర్నెట్‌డెస్క్‌:  వాళ్లంతా వధూవరులను ఆశీర్వదించి, పెళ్లి భోజనం తిని సంతోషంగా తిరిగి వెళదామనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టింది. పెళ్లిలో తిన్నది అరిగేంత వరకూ వాళ్ల చేత కప్పగంతులు వేయించారు పోలీసులు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాలోని ఉమరి గ్రామంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా 300 మంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేయడానికి వెళ్లారు. పోలీసులు రావడం గమనించిన కొందరు అతిథులు అక్కడి నుంచి తప్పించుకోగా.. కొంతమంది మాత్రం దొరికిపోయారు. దొరికిన 17 మందికి శిక్షగా రోడ్డు మీద కప్పగంతులు వేయించారు పోలీసులు.  

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో కొత్తగా 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వీటితో కలిపి మొత్తం కరోనా కేసులు 7.47 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7,227 కరోనా మరణాలు సంభవించాయి.  Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని