బెడ్‌కు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త సుమీ!

తాజా వార్తలు

Published : 20/07/2021 01:55 IST

బెడ్‌కు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త సుమీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖాళీ సమయం దొరికితే చాలు బెడ్​పై సేదతీరుతాం. అప్పుడప్పుడు మంచంపైనే కూర్చుని తింటాం. నిద్రించే సమయంలో బెడ్​పై పడుకుని దొర్లుతూ ఉంటారు కొందరు. దిండును హత్తుకుని పడుకునేవారు ఇంకొందరు. బెడ్​ షీట్​ను చుట్టుకుని కలల ప్రపంచంలోకి జారుకునే వారు మరికొందరు. అయితే..​ బెడ్‌పై ఎక్కువసేపు ఉండటం మంచిదికాదని చెబుతున్నారు బ్రిటన్​కు చెందిన ఓ సూక్ష్మజీవుల నిపుణుడు. బెడ్​పై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుందని అధ్యయనంలో తేలిందట.  

మనం ఊహించినంత నీట్​గా 'బెడ్'​ ఉండదనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదని ఓ అధ్యయనంలో తేల్చారు లండన్​కు చెందిన ఓ శాస్త్రవేత్త. చెమట, ఉమ్ము, డాండ్రఫ్, మృత చర్మ కణాలు, ఆహార పదార్థాలు మొదలైనవి బెడ్​పై ప్రమాదకరజీవుల్లా మారుతాయని పేర్కొంటున్నారు. వీటి కారణంగా బెడ్​పై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్​ వ్యాప్తిచెందుతుందని వివరించారు. బెడ్​షీట్లపై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుందని.. ఓ ఆసుపత్రిలోని బెడ్​షీట్లపై నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. 

స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా బెడ్​షీట్లపై అధికంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. స్టాఫిలోకొక్కస్ ప్రమాదకర బ్యాక్టీరియా కాదు. కానీ.. చర్మంపై గాయాలైన చోట నుంచి ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. స్టాఫిలోకొక్కస్ ఆరియస్- స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా జాతిలో ఇది చాలా ప్రమాదకారి. దీని వల్ల చర్మ వ్యాధులు, న్యుమోనియా, మెటిమలు తీవ్రమవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ రకం బ్యాక్టీరియా కూడా ఆసుపత్రి బెడ్లపైనే ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రామ్​ నెగటివ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, న్యుమోనియా, డయేరియా మొదలైన వ్యాధులు సంక్రమిస్తాయి.

నిద్రిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి సాధారణంగా 500 మిలియన్ల చర్మ కణాలు బెడ్​పై పడతాయి. నల్లులు వీటిని ఆహారంగా సేవిస్తాయి. ఈ పురుగులు వదిలే వ్యర్థాల ద్వారా అలర్జీ, ఆస్తమా వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. బెడ్​పై ఉండే ఈ పురుగుల ద్వారా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఒత్తిడి, నిద్రలేమి, అలర్జీ వంటి మానసిక సమస్యలకు ఇవి కారణం అవుతాయి. బట్టలు, బ్యాగుల ద్వారా నల్లులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంది. పరిశుభ్రంగా లేని వస్తువుల ద్వారా సూక్ష్మజీవులు బెడ్​పైకి చేరతాయి. బట్టలు, టవల్స్, కిచెన్​లోని వస్తువులు, పెంపుడు జంతువుల ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. బాత్​రూమ్, కిచెన్ టవల్స్​ ద్వారా ఎస్ ఆరియస్, ఈ కొలి బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.

బెడ్‌ను ఇలా శుభ్రంగా ఉంచుకోవచ్చు..

* బట్టలు, బెడ్​షీట్​లు రెగ్యులర్​గా, సరిగ్గా ఉతకడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను అంతం చేయొచ్చు. రోజూ బెట్​షీట్​లను ఉతకలేం కాబట్టి వాటిని ప్రతి ఉదయం గాలికి ఆరబెట్టాలి.

* కనీసం రెండు వారాలకోసారైనా బెడ్​షీట్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్​ పరిసరాలను వ్యాక్యూమ్​ క్లీనింగ్​ ద్వారా రోజూ శుభ్రపరుచుకోవడం మంచిది.

* అర్ధ నగ్నంగా నిద్రించేవారు, ఎక్కువ సమయం బెడ్​పైనే గడిపేవారు, ఎక్కువ చెమట వచ్చేవారు వారానికోసారి బెడ్​షీట్లను తప్పనిసరిగా ఉతకాలి. రెండు, మూడు రోజులకు దిండు కవర్​లను మార్చాలి.

* పడుకునేముందు స్నానం చేయడం, చెమటలు పడుతుండగా బెడ్​పై కునుకు తీయడం, బెడ్​పై కూర్చుని లోషన్స్, ఆయిల్​ మొదలైనవి అప్లై చేయడం మంచిదికాదు.

* పెంపుడు జంతువులను బెడ్​లకు దూరంగా ఉంచాలి.

* బెడ్​పై ఆహారం, పానీయాలు సేవించకూడదు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని