ఈరోజు (24-04-2024)

ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

మీ మీ రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్య వ్యవహారాలలో మృదుసంభాషణ  అవసరం. ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.  ప్రశాంతంగా అలోచించి  నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా ఆరాధనా శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని