ఈరోజు (28-03-2024)

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది .పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల  శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి,మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతిపనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి. వృత్తి,వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. చంచల స్వభావాన్ని రానీయకండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది.  ఇష్టదైవస్తుతి  శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని