‘మహా’ పోలీసులపై కరోనా పంజా
close

తాజా వార్తలు

Published : 30/05/2020 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహా’ పోలీసులపై కరోనా పంజా

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. మహారాష్ట్రలో దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో విదితమే. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వసంస్థలలో ఒకటైన పోలీస్‌శాఖను ఈ వైరస్‌ వణికిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో సుమారు 114 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మొత్తంగా చూస్తే ఆ రాష్ట్ర పోలీస్‌శాఖకు సంబంధించి ఇప్పటివరకు 1330 కరోనా బాధితులు ఉన్నారు. 24 మంది మృతులు ఉన్నారు. గత నెలలో సుమారు 55 మంది ముంబయి పోలీసులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. వీరిలో 52 మంది మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నట్టుగా గుర్తించారు. కరోనా కట్టడిలో ప్రధాన భూమిక పోషిస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీస్‌ శాఖలలో పనిచేసేవారికి ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని