ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి.. 
close

తాజా వార్తలు

Published : 26/02/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి.. 

హరియాణాలో ఘటన.. 

హరియాణా: దేశంలో రోజురోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసిన ఈ నేరాలు ఆగడం లేదు. మరోవైపు బాధితులు, నిందితుల్లో మైనర్ల సంఖ్య పెరిగిపోతుండడం విస్తుగొలిపిస్తోంది. ఇంటిదగ్గర దిగబెడతానని మైనర్‌ బాలికను నమ్మించి స్నేహితురాలి బంధువు ఒకరు మత్తుమందు ఇచ్చి తన స్నేహితులతో పాటు ఆత్యాచారానికి ఒడిగట్టాడు. వీరిలో ఒకరు మైనర్‌ బాలుడు కూడా ఉన్నాడు. ఈ అమానుష ఘటన హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురుక్షేత్రలో 12వ తరగతి చదువుతోన్న బాలికను ఈ నెల 22న ఉదయం తన తండ్రి పాఠశాలలో విడిచివెళ్లాడు. పాఠశాల అనంతరం మధ్యాహ్నం వేళ ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సదరు బాలికకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇంటిదగ్గర దిగబెడతానని స్నేహితురాలి బంధువు ఒకరు ఆమెను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని ఉమ్రి చౌక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నిందితుడు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.   అయితే సాయంత్రమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు అంతటా వెతికారు. తను చదువుతున్న పాఠశాలలో ఆరా తీశారు. చివరికి వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ బాలిక తలపై తుపాకీ గురిపెట్టి ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండడాన్ని గమనించిన తల్లిదండ్రులు వారిని అడ్డగించారు. దీంతో సదరు వ్యక్తులు బాలికను వదిలేసి అక్కడినుంచి పరారయ్యారు. అప్పటికే బాలిక అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసుస్టేషన్‌ల్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న మగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌ కౌర్‌ తెలిపారు. నిందితుల్లో ఓ మైనర్‌ కూడా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మిగతా ఇద్దరికోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంఘటనా సమయంలో నిందితులు కూడా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని