close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/06/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను జయించిన 27 రోజుల చిన్నారి

పుణె: చికిత్సానంతరం కరోనా వైరస్‌ వ్యాధి నయం కావటంతో 193 మందిని డిశ్చార్జీ చేసినట్టు పుణె నగర పాలిక ఇటీవల ప్రకటించింది. వీరిలో 27 రోజుల చిన్నారి కూడా ఒకరు కావటం విశేషం. హదాప్సర్‌ గ్రామానికి చెందిన ఈ చిన్నారి నగరంలోని సాస్సోన్‌ ఆస్పత్రిలో మే 20న జన్మించాడు. అయితే ఈ చిన్నారి పుట్టుకతోనే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు గమనించారు. అనుమానంతో కొవిడ్‌ పరీక్ష చేయగా చిన్నారికి కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం ఆ బాలునికి మరోసారి కొవిడ్‌-19 పరీక్ష చేయగా... వ్యాధి పూర్తిగా నయమైందని తెలిసింది. కాగా, ఈ బాలుడితో సహా తమ నగరంలో కొవిడ్‌ నయమైన వారి సంఖ్య 6,906 అని పుణె నగర పాలిక అధికారులు వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.