557మంది పోలీసులకు కరోనా!
close

తాజా వార్తలు

Published : 08/05/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

557మంది పోలీసులకు కరోనా!

ముంబయి: కరోనా వైరస్‌ ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు సంభవిస్తుండడంతోపాటు రోజు కొత్తగా 1200లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18వేలు దాటగా 700మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తోన్న 557మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడినట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. వీరిలో దాదాపు 50మంది ఉన్నతాధికారులు కాగా మరో 500మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ వైరస్‌ సోకి ఇప్పటివరకు ఐదుగురు పోలీసులు మరణించారు. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 2లక్షల 26వేల సాధారణ ప్రజలను క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. అంతేకాకుండా 4,729 రిలీఫ్‌ క్యాంపుల్లో  4లక్షల మంది వలస కార్మికులకు వసతి కల్పించామని తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి దాదాపు రూ.3కోట్ల 66లక్షలను జరిమానా వసూలు చేసినట్లు అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని