నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష
close

తాజా వార్తలు

Published : 16/04/2020 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, యువతకు ఉపాధి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు కోర్సులు, శిక్షణకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నైపుణ్య కేంద్రాల ఏర్పాటుపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీతో పాటు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్య కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. 

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రవేశపెట్టే ఏ కోర్సుకైనా కనీస కాలవ్యవధి 6నెలలు ఉండాలని సీఎం సూచించారు. కోర్సులు, పాఠ్య ప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని ఆదేశించారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు చేసిన వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా ఇవి ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఈ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాదిపాటు అప్రెంటిస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, శిక్షణ ఇవ్వడమే వీటి ఏర్పాటు ముఖ్య లక్ష్యమని చెప్పారు. అత్యుత్తమ శిక్షణ కోసం విశాఖలో మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని