close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120056532 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 9QJ-djwXbxo [video_short_link] => 9QJ-djwXbxo [created_by] => [created_date] => [modified_by] => 9030378 [modified_date] => 2020-04-27 20:22:29.372815 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 27/04/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా నాకైనా సోకొచ్చు: జగన్‌

మన జీవితంలో అది అంతర్భాగం అవుతుంది

రోగనిరోధక శక్తే కరోనా నివారణకు పరిష్కారం

సామాన్యుడికి నష్టం జరగకుండా అడుగులు వేశాం

గ్రీన్‌జోన్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి మే 15న నోటిఫికేషన్‌

అమరావతి: దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు. 

63 మండలాలు రెడ్‌జోన్‌లో..

‘‘కరోనాకు సంబంధించిన విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. క్వారంటైన్‌లో ఉండేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మంచి ఆహారం అందిస్తున్నాం. పీపీఈలు, ఎన్‌95 మాస్కులు గతంలో ఏ ఆస్పత్రుల్లోనూ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లోనూ అవి సమృద్ధిగా ఉన్నాయి. ఈ నెల రోజుల్లో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి చోటా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. అక్కడికి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి తరలిస్తున్నాం. రాష్ట్రంలోని 676 మండలాల్లో 63 మాత్రమే రెడ్‌జోన్‌లో.. 54 ఆరెంజ్‌ జోన్‌లో.. 559 మండలాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. గ్రీన్‌ జోన్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడ అన్ని పనులూ యథాతథంగా జరుగుతాయి. ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. బయటకు వెళ్లినపుడు తప్పకుండా మాస్కులు ధరించాలి.


ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాం..

కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం. 14400 ప్రత్యేకంగా టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా కరోనా కేసులే కాకుండా మిగతా వ్యాధులకు కూడా చికిత్స అందించేలా చర్యలు చేపట్టాం. ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వడమే మాత్రమే అవసరమైన మందులను డోర్‌ డెలివరీ చేసేందుకు ఈనెల రోజుల్లేనే వ్యవస్థను తీసుకెళ్లగలిగాం. ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు సర్వే చేశాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాం. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా’’ అని సీఎం చెప్పారు.

కష్టాలున్నా.. గొప్పగా చేశాం

‘‘కరోనాతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుడికి కొద్దొగొప్పో కష్టం కూడా ఏర్పడింది. రాష్ట్రానికి ఎటువంటి ఆదాయాలు రాని పరిస్థితి ఉన్నప్పటికీ వీలైనంత వరకు సామాన్యుడికి ఎక్కడా నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందడుగులు వేసింది. ఇన్ని కష్టాలున్నా.. ఒక్కసారి ఇచ్చే రేషన్‌ సరకులును ఇప్పుడు మూడుసార్లు ఇస్తున్నాం. ప్రతి పేద ఇంటికీ రూ.వెయ్యి సహాయం అందజేయగలిగాం. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు క్రమం తప్పకుండా ఇవ్వగలిగాం. ఈనెల రోజుల్లో ఇవన్నీ గొప్పగా చేశాం.


 

వివక్ష చూపాల్సిన అవసరం లేదు

కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుంది. ఈ వైరస్‌ సోకితే అంటరానితనం.. ఒక భయంకరమైన రోగమనే భావనను అందరూ తీసేయాలి. ఈ వైరస్‌ సోకినవారిపట్ల వివక్ష చూపాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో అందరికీ సహజంగా సోకే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. మన జీవితంలో కరోనా అంతర్భాగం అవుతుంది. ఒక్కోసారి కరోనా సోకిన వ్యక్తికి ఆ విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్లే 80 శాతం మంది ఉన్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ బయటపడని అవకాశమూ ఉంటుంది. కొందరికి ఇది ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి.

పెద్దవాళ్లను కాపాడుకునేందుకు జాగ్రత్తలు అవసరం

ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 81 శాతం కేసులు ఇళ్లల్లో ఉండి నయమైనవి ఉన్నాయి. ఇది జ్వరంలాంటిదే.. ఎవరికైనా రావొచ్చు. రేపు పొద్దున నాకైనా రావొచ్చు. జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. పెద్దవాళ్లకు కాస్త దూరంగా ఉండాలి.. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా తమంతట తామే వైద్యులకు సమాచారమిస్తే చికిత్స అందించి వెళ్తారు. మనంతట మనమే దీన్ని కట్టడి చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే పరిష్కారం’’ అని జగన్‌ చెప్పారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.