
తాజా వార్తలు
సత్వరమే సాయం అందించాలి: జగన్
‘నివర్’ ప్రభావంపై సీఎం సమీక్ష
అమరావతి: భారీ వర్షాలతో ఎలాంటి నష్టం జరిగినా వెంటనే సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నివర్ తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వానల ప్రభావం, వివిధ జిల్లాల్లో పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నివర్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయని.. నెల్లూరు జిల్లాలో సగటున 7 సె.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పెన్నాలో ప్రభావం అధికంగా ఉండొచ్చని.. సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకొని నీరును విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల పంటలు పెద్ద ఎత్తున నీటమునిగాయని.. వర్షాలు తగ్గగానే నష్టం అంచనా వేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
