close

తాజా వార్తలు

Published : 30/09/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాలంటీర్ల సేవలు మరో ఏడాది పొడిగింపు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ వ్యవస్థను గతేడాది ఆగస్టు 15న ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్‌ను నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.