ఫోన్‌లో జగన్‌కు థాంక్స్‌ చెప్పా: చిరంజీవి
close

తాజా వార్తలు

Published : 24/05/2020 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోన్‌లో జగన్‌కు థాంక్స్‌ చెప్పా: చిరంజీవి

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకుంటున్నారంటూ అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు చిరు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ట్విటర్‌ ద్వారా దీన్ని తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవడంతోపాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు చిత్ర పరిశ్రమ తరుపున ఫోన్‌లో జగన్‌కి కృతజ్ఞతలు తెలిపా. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని ఆయన చెప్పారు’ అని చిరు ట్వీట్‌ చేశారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేశ్‌బాబు తదితరులు కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి కేసీఆర్‌ స్పందిస్తూ.. జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించుకోవచ్చని చెప్పారు. పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని