close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 24/05/2020 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబాబు విశాఖ పర్యటనపై సందిగ్ధత

హైదరాబాద్‌: చంద్రబాబు విశాఖ పర్యటపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఏపీలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటన రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు నేరుగా విశాఖ వెళ్లాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే రెండు రాష్ట్రాల డీజీపీల అనుమమతి తీసుకున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకునేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే తాజా ప్రకటనతో చంద్రబాబు పర్యటనపై  సందిగ్ధత ఏర్పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకు అమరావతి నుంచే చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. జూమ్‌ యాప్‌ ద్వారా దాదాపు 14,000 మంది నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

మరోవైపు ఈ అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సుమారు వెయ్యికిపైగా సర్వీసులు నడిపేందుకు పౌరవిమానయానశాఖ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి ట్విటర్‌లో వెల్లడించారు. అయితే  ఏపీ, బంగాల్‌కు విమాన సర్వీసులు కొంత ఆలస్యమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీకి ఈ నెల 26న, బంగాల్‌కు 28న సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఏపీ, బంగాల్‌ ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.