కరోనా వ్యాపించని దేశాలున్నాయి! ఏవో తెలుసా?
close

తాజా వార్తలు

Published : 06/04/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వ్యాపించని దేశాలున్నాయి! ఏవో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ బారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కరోనా కేసులు నమోదుకాగా దాదాపు 70 వేల మంది మృత్యువాతపడ్డారు. చైనాలోని వుహాన్‌ నగరంలో మొదలైన ఈ వైరస్‌ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించడమే కాకుండా అమెరికా, యూరోపియన్ దేశాలైన ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీల్లో దీని తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడని దేశాలు ఉన్నాయి. ఫసిఫిక్‌ తీరంలోని చిన్న ఐలాండ్ దేశాలైన సాల్మన్‌ ఐలాండ్, వనౌతు, సమోవా, కిరిబాతి, మైక్రోనేషియా, టోంగా, ది మార్షల్ ఐలాండ్‌ పలవౌ, టువాలు, నౌరు వంటి దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి కారణం ఆ దేశాలు దూర ప్రాంతాల్లో ఉండటమే కాకుండా ప్రయాణాలపై ఉన్న పరిమితుల వల్ల ఇప్పటి వరకు ఆయా దేశాల్లో  ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

ఇక ఆసియా దేశాలైన ఉత్తర కొరియా, యెమెన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, తజకిస్థాన్‌లలో కూడా ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఆయా దేశాలు ప్రకటించాయి. అయితే అంతర్జాతీయ నిపుణలు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా పొరుగు దేశమైన  చైనాలో తొలుత ఈ వైరస్‌ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చైనా నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించే తరుణంలో ఈ వైరస్‌ ఆ దేశంలో దాదాపు 80 వేల మందికి సోకింది. అలానే 3 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో 3 లక్షల మందికి ఈ వైరస్ సోకగా 9 వేల మంది మరణించారు. అలానే 17 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో 4067 కరోనా కేసులు నమోదు కాగా 291 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 109 మంది మృత్యువాతపడ్డారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని