ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అచ్చెన్నకు అనుమతి
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అచ్చెన్నకు అనుమతి

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన్న ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తాజాగా విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించే అంశంపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై గత నెల 12న అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏసీబీ కస్టడీలోనే ఉంటున్నారు.  ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్‌కు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.  అచ్చెన్న ఆరోగ్యంపై వారానికి రెండుసార్లు నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. అచ్చెన్నాయుడు లేవనెత్తిన అంశాలపై అదనపు కౌంటర్ వేయాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని