లాక్‌డౌన్‌: మహారాష్ట్ర కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 17/05/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌: మహారాష్ట్ర కీలక నిర్ణయం

ముంబయి: దేశంలో అత్యధిక కరోనా కేసులతో సతమతమవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 30వేలు దాటింది. శనివారం కొత్తగా  మరో 1,606 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మే 31వరకూ లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ముంబయిలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 884 కేసులు నమోదయ్యాయి. ఒక పక్క కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ)లో కొత్త కంటైన్మెంట్‌ పాలసీ విధానాన్ని తీసుకొస్తున్నారు.

ఇప్పటివరకూ ఎక్కడైనా కరోనా కేసులు బయటపడితే ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ వచ్చారు. కరోనా బాధితుల ఇంటికి వెళ్లే రహదారులను ఇనుప కంచెలతో మూసివేస్తున్నారు. కాగా, ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కరోనా బాధితులు ఉన్న ఇల్లు, లేదా అపార్ట్‌మెంట్‌ను మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తారు. దీని వల్ల ఒక గేటెడ్‌ కమ్యూనిటీలోని ఇతర అపార్ట్‌మెంట్‌ వాసులకు వెసులుబాటు లభిస్తుంది. కరోనా బాధితులు ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు మినహా మిగిలిన లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు తమ పనులు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీని వల్ల అధికారులు, పోలీసులపై భారం తగ్గుతుందని బీఎంసీ భావిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని