close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇప్పుడేం సమాధానం చెబుతారు?:బండి సంజయ్‌

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన ఈ తీర్పు.. వాస్తవాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందంటూ దశాబ్దాలుగా కొందరు చేసిన ప్రచారం అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై గౌరవంతో భాజపా అగ్రనేతలు తీర్పు కోసం ఎదురు చూశారని సంజయ్‌ చెప్పారు. దశాబ్దాలుగా ఈ ఘటనను బూచిగా పేర్కొంటూ భాజపాను దోషిగా చూపి రాజకీయ పబ్బం గడిపిన పార్టీలు.. ఇప్పుడేం సమాధానం చెబుతాయని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించుకుంటున్న ఈ తరుణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషాన్ని కలిగించిందని బండి సంజయ్‌ చెప్పారు. న్యాయ పోరాటంలో విశేషకృషి చేసిన న్యాయవాదులతో పాటు దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.