
తాజా వార్తలు
మేనిఫెస్టో భాజపాకు భగవద్గీత:బండి సంజయ్
గ్రేటర్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా
విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్న
హైదరాబాద్: భాగ్యనగరంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు పక్కా సమాచారం ఉన్నప్పుడు బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సీఎం కేసీఆర్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఘర్షణలు జరిగాక అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ఓటింగ్‌కు సామాన్య ప్రజలు రాకుండా ఉండేందుకు పథకం ప్రకారం సీఎం చేస్తున్న పన్నాగమని ఆరోపించారు. సీఎం ఏం రాసిస్తే పోలీసు అధికారులు అదే చదువుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్చెరులో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సంజయ్ మాట్లాడారు. కమీషన్ల కోసమే పాత సచివాలయాన్ని కూల్చేశారని ఆయన ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కొవిడ్ సమయంలో ప్రైవేటు టీచర్లు పస్తులున్నారని.. ఆటో డ్రైవర్ల పరిస్థితి అద్వానంగా మారిందని చెప్పారు. ఉపాధి లేక కుటుంబాలకు పోషించలేక ఇబ్బందులు పడ్డారని సంజయ్ వివరించారు. అందుకే నగరంలోని ఆటో డ్రైవర్లు రూ.7వేలు ఇచ్చేందుకు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా పెట్టిందని చెప్పారు. భాజపా మేనిఫెస్టోను భగవద్గీతగా భావిస్తామన్నారు.
ఈ నాలుగురోజులు మాకోసం కేటాయించండి..
ఈ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే ఎల్ఆర్ఎస్ ప్రజల మద్దతు ఉందని భావించి తెరాస ప్రభుత్వం బీఆర్ఎస్ తీసుకొస్తుందని సంజయ్ అన్నారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే తెరాస పోవాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలిస్తే 125 గజాలోపు ఇల్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని.. ఏనాడూ ఉద్యమంలోనూ ఆ పార్టీ పాల్గొనలేదని బండి సంజయ్ ఆరోపించారు. వరద బాధితులకు ఇచ్చే సాయం అంశంలో తన సంతకం ఫోర్జరీ చేశారని.. దీనిపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని సవాల్ చేస్తే తోకముడిచారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 100కి పైగా సీట్లను భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో నివసిస్తున్న రోహింగ్యాలను నగరం నుంచి బయటకు పంపించాలని.. లేదంటే భాజపా గెలిచిన తర్వాత తప్పకుండా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ నాలుగు రోజులు తమ కోసం కేటాయిస్తే.. వచ్చే ఐదేళ్లు నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. నగరంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించేలా చేస్తామని స్పష్టం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
