బీజింగ్‌లో మరోసారి కరోనా..!
close

తాజా వార్తలు

Published : 12/06/2020 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీజింగ్‌లో మరోసారి కరోనా..!

55రోజుల అనంతరం బయటపడుతున్న కేసులు..

బీజింగ్‌: కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిందని చెబుతున్న చైనాలో కొవిడ్‌-19కేసులు తిరిగి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన వుహాన్ నగరంలో భారీగా చేపట్టిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మరోసారి బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా సోకిన వీరిద్దరూ చైనా మాంసపు ఆహార సమగ్ర పరిశోధన కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం. అయితే, గత 55రోజుల్లో ఒక్కకేసు కూడా నమోదు కాని జీజింగ్‌లో తాజాగా రెండు రోజుల్లోనే మూడు కేసులు నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. ఈ సమయంలో మరోసారి వైరస్‌ విజృంభణ ఎప్పుడైనా రావచ్చని ఈ సంఘటన హెచ్చరిస్తున్నట్లు బీజింగ్‌ సీడీసీ అధికారులు గుర్తుచేశారు. వైరస్‌ తీవ్రత తగ్గిందనుకొని అత్యవసర స్థాయి లెవల్‌-2 నుంచి లెవల్‌-3కి తగ్గించిన సమయంలో కేసులు మళ్లీ బయటపడటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

ఇక రెండురోజుల క్రితం ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు 50మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో పాఠశాలలు క్లస్టర్లుగా మారే అవకాశం ఉందని భావించిన అధికారులు వారి కాంటాక్టులను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఆ విద్యార్థి తండ్రి బీజింగ్‌ దాటి బయటకు వెళ్లకున్నా వైరస్‌ ఎలా సంక్రమించిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని