విమానాల్లో... వరాహాలు!
close

తాజా వార్తలు

Published : 11/06/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమానాల్లో... వరాహాలు!

జంబో జెట్‌లలో తరలింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కొరతలను సృష్టిస్తోంది. ఇక విచిత్రమైన ఆహారపు అలవాట్లకు నిలయమైన చైనాలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చైనాలో పంది మాంసానికి విపరీతమైన డిమాండు ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ అనే సంగతి తెలిసిందే. అయితే కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో ఆ దేశంలో పంది మాంసానికి కొరత ఏర్పడింది. దీనితో దేశీయంగా వరాహాల సంఖ్యను పెంచే ప్రయత్నాలను ఆ దేశం తీవ్రతరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఆ దేశం ఫ్రాన్స్‌ నుంచి వరాహాలను దిగుమతి చేసుకుంటోంది.
కాగా, చైనా నిర్ణయం రష్యాకు చెందిన వోల్గా నేపర్‌ గ్రూపు అనే విమానయాన సంస్థకు కలసివచ్చింది. సంతానోత్పత్తి దశలో ఉన్న మూడువేలకు పైగా వరాహాలను ఈ సంస్థ ఆకాశ మార్గంలో ఫ్రాన్స్‌ నుంచి చైనాకు తరలించింది. అంటే బోయింగ్‌ 747 కార్గో విమానాల్లో సుమారు 10,400 కి.మీ ప్రయాణించి ప్రయాణించి మరీ చైనాను చేరాయన్నమాట. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని