ఎక్కడివారు అక్కడే ఉండాలి: జగన్‌
close

తాజా వార్తలు

Published : 03/05/2020 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎక్కడివారు అక్కడే ఉండాలి: జగన్‌

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వలసకూలీలకు అనుమతి


 

అమరావతి: కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సరిహద్దు వద్ద వలస కూలీలకు అనుమతి ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వలస కూలీలు వేలల్లో వస్తున్నారని.. వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా నివారణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర సరిహద్దు వద్దకు చేరుకుంటున్న వలస కూలీలకు సదుపాయాల కల్పన కష్టమవుతోందని.. మిగిలిన వారు సహకరించాలని సీఎం కోరారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఈ సందర్భంగా జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రభుత్వం సూచనలను ప్రజలంతా పాటించాలని కోరారు. కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమన్నారు.  

మద్యం ధర 25 శాతం పెంపు

మరోవైపు మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచడం, మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న రోజుల్లో మరిన్ని మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించేలా మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించింది.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని