వాళ్లు పౌష్టికాహారం తీసుకునేలా చూడండి:జగన్‌
close

తాజా వార్తలు

Updated : 16/04/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు పౌష్టికాహారం తీసుకునేలా చూడండి:జగన్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భౌతికదూరం పాటించేలా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

క్వారంటైన్‌ తర్వాత పస్తులుండొద్దు..

ముందు జాగ్రత్తగా అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచామని.. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే పేదలకు రూ.2వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అలా ఇంటికి వెళ్లే వారంతా పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయాలని.. లేదంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నగదు సాయంతో పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇంటికి పంపిన తర్వాత పస్తులుండే పరిస్థితి ఉండకూడదనే రూ.2వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒక్కొక్కరికీ మూడేసి మాస్కులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో వాటి తయారీ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని జగన్‌ ఆదేశించారు. తొలుత హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేయాలని చెప్పారు. రేపటి నుంచి డెలివరీని ప్రారంభిస్తామని.. రెండు మూడు రోజుల్లో పంపిణీ సంఖ్యను పెంచుతామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఆర్బీకేల కేంద్రంగా మార్కెటింగ్

మరోవైపు ఇతర అంశాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లోనే ఉంచాలని ఆదేశించారు.  రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవాలని.. కియోస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని జగన్‌ సూచించారు. ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని