దీపావళి నాటికి ఆరోగ్యశ్రీని విస్తరిస్తాం:జగన్‌
close

తాజా వార్తలు

Published : 30/05/2020 02:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళి నాటికి ఆరోగ్యశ్రీని విస్తరిస్తాం:జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించడం సహా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ‘‘మన పాలన - మీ సూచన” పేరుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షించారు. ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం జగన్‌ ప్రధానంగా చర్చించారు.

దీపావళి నాటికి విస్తరిస్తాం..
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. గతంలో నిర్లక్ష్యం చేసిన  వైద్య రంగాన్ని ఏడాది కాలంగా బలోపేతం చేసినట్లు చెప్పారు. రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేసే పథకాన్ని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై 8న మరో 6 జిల్లాలకు విస్తరిస్తామన్నారు. వచ్చే దీపావళి నాటికి రాష్ట్రమంతటా విస్తరించి 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని వివరించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అమలు చేస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు.

మూడేళ్లలో సమూల మార్పులు..
‘‘కొత్తగా క్యూఆర్ కోడ్‌ విధానంతో ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసి రోగుల వైద్య నివేదికలు పొందుపరుస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందిస్తున్నాం. కంటి వెలుగు ద్వారా రూ. 540 కోట్లతో విద్యార్థులు, వృద్ధులకు కళ్లద్దాలు అందించాం. 46 వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయిస్తాం. రూ. 16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగంలో మూడేళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు, కొత్తగా పీహెచ్‌సీల నిర్మాణం చేపడతాం’’ అని సీఎం జగన్‌ వివరించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని