కేంద్రం నిర్ణయమేదైనా మద్దతిస్తాం: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 14/04/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రం నిర్ణయమేదైనా మద్దతిస్తాం: జగన్‌

అమరావతి: లాక్‌డౌన్‌ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథచక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారంతో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్నందున దేశాన్ని మూడు జోన్లుగా విభజించి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతామని చెప్పారు. వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని ప్రధానికి జగన్‌ నివేదించారు. డిమాండ్‌, సరఫరా చైన్‌కు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక రథచక్రాన్ని వేగంగా పరుగెత్తించలేకపోయినా కనీసవేగంతోనైనా నడపాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయ రంగానిదేనని.. లాక్‌డౌన్‌ కారణంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్‌, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయని జగన్‌ లేఖలో తెలిపారు. ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించాయి. ఆక్వా ఎగుమతులకు ఆయా దేశాల్ల్లో మార్కెట్లు తెరుచుకునేలా కేంద్ర వాణిజ్యశాఖ చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గోదాములు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నందున వీలైనంత వరకు ఖాళీ అయ్యేలా చూడాలన్నారు. జాతీయ రహదారులతో పాటు రైల్వేల ద్వారా తిరిగి రవాణాను తిరిగి ప్రారంభించాలని ప్రధానిని జగన్‌ కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని