పాదయాత్రలో వారి కష్టాలు చూశా: జగన్‌
close

తాజా వార్తలు

Published : 03/07/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాదయాత్రలో వారి కష్టాలు చూశా: జగన్‌

ఔట్‌ సోర్సింగ్‌కార్పొరేషన్‌ ప్రారంభించిన సీఎం
వ్యవస్థలో మార్పు తెచ్చేందుకేనని వ్యాఖ్య 

అమరావతి: వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ప్రారంభించినట్టు ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల సమస్యలను పాదయాత్రలో చూశాననని చెప్పారు. శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు గతంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తీసుకొచ్చారు. ఉద్యోగులకు అన్యాయం చేసేలా చేశారు. వ్యవస్థను పూర్తిగా మార్చి పారదర్శకత తీసుకురావాలనే మేం ఈ చర్యలు చేపట్టాం. ఎవరికీ లంచాలు, వివక్షకు తావివ్వకూడదనే మార్పులు తెచ్చాం. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా అందరూ పనిచేయాలి’’ అన్నారు.

50శాతం ఉద్యోగాలు వారికే..

‘‘రాష్ట్రంలో 50శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తాం. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగాల్లో 50శాతం మహిళలకు కేటాయిస్తాం. కలెక్టర్లు ఛైర్మన్‌గా ఉండి ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఆప్కోస్‌ ద్వారా ప్రతి నెలా 1న పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు అందజేస్తాం. లంచాలు, కమీషను లేకుండా పూర్తి వేతనం ఉద్యోగికి అందిస్తారు. ఆప్కోస్‌ ద్వారా 50,449 మందికి నియామక పత్రాలు ఇవాళే అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాలు ఆప్కోస్‌తో అనుసంధానం చేసి ఖాళీలను భర్తీ చేస్తాం. పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలి’’ అని సూచించారు.

ఏజెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం

‘‘పొరుగు సేవల ఉద్యోగాల పేరిట కమీషన్‌ ఏజెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. 20మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు చూపి 15మందినే నియమించేవారు. మిగిలిన సొమ్మును కాట్రాక్టర్ల జేబుల్లో వేసుకొనేవాళ్లు. ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుతో ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఉద్యోగులు పనిచేసే విధానం బట్టి ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంటుంది. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగులకు సంబంధించి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ క్రమం తప్పకుండా చెల్లిస్తాం. ఆయా ప్రాంతాల్లో నియామక ప్తరాలను మంత్రులు, ఎమ్మెల్యేలు  అందిస్తారు’’ అని సీఎం అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని