కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ
close

తాజా వార్తలు

Published : 13/05/2020 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ

అమరావతి: కువైట్‌లో చిక్కుకుపోయిన ఏపీ వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన మేరకు విమానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు జగన్‌ లేఖ రాశారు. వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందేభారత్‌’ మిషన్‌ పేరుతో చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు దీన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు.

కరోనా మహమ్మారితో గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకున్న వలస కార్మికులు స్వదేశానికి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారనీ.. వారంతా ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని లేఖలో వివరించారు. కువైట్‌లో కనీస వసతులు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వీరి ప్రయాణ ఖర్చులు భరించేందుకు కువైట్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసిందనీ.. ఈ నేపథ్యంలో వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కువైట్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులును వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని