close

తాజా వార్తలు

Published : 27/11/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖకు పైపులైన్‌ డీపీఆర్‌ సిద్ధం చేయండి:జగన్‌

అమరావతి: భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు వచ్చే రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల నిర్మాణాలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి గౌతమ్‌ రెడ్డి, సీఎస్‌, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్‌ హర్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై సీఎం ఆరా తీశారు. 

విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ నగరానికి వేగంగా చేరుకునేలా బీచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. పోలవరం నుంచి విశాఖకు పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది సంక్రాంతిలోపు శంకుస్థాపనకు అధికారులు సన్నద్ధం కావాలని సీఎం దిశానిర్దేశం చేయాలి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన