ఇళ్ల స్థలం వద్దే పట్టాల పంపిణీ:జగన్‌​​​​​​​
close

తాజా వార్తలు

Published : 02/06/2020 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల స్థలం వద్దే పట్టాల పంపిణీ:జగన్‌​​​​​​​

అమరావతి: పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల స్థలాలపై మంత్రి శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులతో పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 3,38,144 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉన్న రూ. 1,323 కోట్లు పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చెల్లింపులు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు అవసరమైన నిధులను సమీకరించి వీలైనంత త్వరగా ఓ తేదీని ప్రకటించాలని అధికారులకు సూచించారు.

తొలి విడతలో చేపట్టే 15 లక్షల గృహ నిర్మాణాల్లో విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ గృహాల్లో పడక గది, వంట గది, లివింగ్‌ రూం, వరండా, మరుగుదొడ్ల లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులంటే నాసికరం అనే చెడ్డపేరు పోవాలని.. ప్రభుత్వం నాణ్యతతో పని చేస్తుందనే పేరు రావాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూనే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని