పెట్టుబడుల విషయంలో పారదర్శకత ఉండాలి
close

తాజా వార్తలు

Published : 06/06/2020 03:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబడుల విషయంలో పారదర్శకత ఉండాలి

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి

అమరావతి: రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ పార్కు, క్లస్టర్ల ఏర్పాటుకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎం నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. పారిశ్రామిక విధానానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడటమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహమని సీఎం అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అందుకు అనుకూలంగా పారదర్శకతతో ఉండాలని జగన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం జగన్‌ అధికారులకు జగన్‌ సూచనలు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని