భారత వృద్ధి రేటు -4.5%
close

తాజా వార్తలు

Published : 25/06/2020 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత వృద్ధి రేటు -4.5%

2020పై ఐఎంఎఫ్‌ అంచనా
ప్రపంచ వృద్ధి అంచనాల్లోనూ కోత

వాషింగ్టన్‌: ప్రస్తుత సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటును -4.5 శాతంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమని తెలిపింది. 1961 తర్వాత భారత్‌కు ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు అని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అయితే 2021లో వృద్ధి తిరిగి పుంజుకుంటుందని, 6 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. 2020లో ప్రపంచ వృద్ధిరేటు -4.9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాతో పోలిస్తే ఇది 1.9 శాతం తక్కువ కావడం గమనార్హం. 2021లో ప్రపంచ వృద్ధి 5.4 శాతానికి పుంజుకుంటుందని నివేదిక వెల్లడించింది. 2020 తొలి అర్థభాగంలో ఆర్థిక కార్యకలాపాలపై కొవిడ్‌-19 ప్రతికూల ప్రభావం ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2020లో తొలిసారి అన్ని దేశాలు ప్రతికూల వృద్ధి బాట పట్టే అవకాశం ఉందని, చైనా మాత్రం ఉద్దీపనలో అండతో 1 శాతం వృద్ధి రేటు నమోదుచేస్తుందని పేర్కొంది. 2020లో అబివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు (-8%) గణనీయంగా పడిపోవచ్చని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాధ్‌ తెలిపారు. వర్ధమానదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు (-3%, చైనాను మినహాయిస్తే -5%), 95కి పైగా ఇతర దేశాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదుచేసే అవకాశం ఉందని వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని