జేసీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ఫోన్‌
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేసీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ఫోన్‌

అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబసభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి పరామర్శించారు. శనివారం ఉదయం ప్రభాకర్‌ రెడ్డితోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ పవన్‌, దీపక్‌ రెడ్డిలకు చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
‘‘ఒక నేరంపై 24 కేసులు పెట్టారు. ఒకటి మినహా అన్నింటిలో బెయిల్‌ వచ్చింది. ఆ ఒక్క కేసులో కూడా సోమవారం బెయిల్‌ వస్తుందనే కక్షకట్టి ఈరోజు అక్రమ అరెస్టు చేశారు. ఏ కేసులోనూ, ఎఫ్‌ఐఆర్‌లోనూ ప్రభాకర్‌ రెడ్డి పేరు లేదు. కావాలనే కక్షసాధింపులో భాగంగానే అరెస్టు చేశారు. బెదిరించి ఎవరితోనో ఇప్పించిన తప్పుడు వాంగ్మూలం తెరమీదకు తెచ్చి ఇలా చేశారు’’ అని జేసీ పవన్‌ ఫోన్‌లో చంద్రబాబుకు వివరించారు. అదేవిధంగా అస్మిత్‌పై ఏవిధమైన కేసూ లేదని.. అరెస్టుకు ముందు తప్పుడు కేసు బనాయించారని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రే అన్నారు. కల్పిత పత్రాలు, తప్పుడు సాక్ష్యాలతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేశారని పవన్‌ మండిపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని