తెదేపా కార్యకర్తలపై దాడులు అమానుషం
close

తాజా వార్తలు

Updated : 01/06/2020 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా కార్యకర్తలపై దాడులు అమానుషం

విజయవాడ: పొన్నూరు, మంత్రాలయం నియోజక వర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు అమానుషమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడడం వైకాపా అరాచక శక్తులకు తగదని హెచ్చరించారు. బీసీలు, దళితులపై వైకాపా దాడులు గత ఏడాదిగా శ్రుతిమించి పోయాయని చంద్రబాబు మండిపడ్డారు. 

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడటం, తోటలు తగులపెట్టడం, బోర్లు ధ్వంసం చేయడం వంటి తదితర అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఈ విషయంలో డీజీపీ తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని