రాజీలేని పోరాటం చేయాలి:చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 10/06/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజీలేని పోరాటం చేయాలి:చంద్రబాబు

అమరావతి: పేదులు, రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పార్టీ ప్రతినిధులు, ఇన్‌ఛార్జులతో చంద్రబాబు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని సూచించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని ప్రజలు ఎన్నడూ ఆదరించరని.. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. వైకాపా ఏడాది పాలనపై తెదేపా ఛార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలోని గనులన్నీ వైకాపా నాయకులే కబ్జా చేశారని ఆరోపించారు. ఇతరులపై తప్పుడు కేసులు, జరిమానాలతో బ్లాక్‌మెయిల్‌ రాకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా సానుభూతిపరుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని