ఈ సమయంలో ఇసుక తవ్వకాలా?:చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 04/04/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సమయంలో ఇసుక తవ్వకాలా?:చంద్రబాబు

ఇది ప్రధాని లాక్‌డౌన్‌ పిలుపునకు తూట్లు పొడవడమే

ఏపీ సీఎం జగన్‌కు తెదేపా అధినేత లేఖ

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా ఐదు ప్రధాన సమస్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో రక్షణ ఉపకరణాల తయారీ చేపట్టడం, ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరల నియంత్రణ, ఇసుక, గ్రావెల్‌, మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల్లో మాఫియా తలమునకలైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ప్రధాని లాక్ డౌన్‌ పిలుపునకు తూట్లు పొడవడమేనని ఆక్షేపించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో సరైన మార్గదర్శకత్వం వహించాలని చంద్రబాబు హితవు పలికారు.

దళారులు, అక్రమ వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో రూ.5కే భోజనం లభించే అవకాశం ప్రజలకు లేకుండా పోయిందన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తీసుకురావాలని... నిత్యావసరాల సరఫరాకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులు ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని