చైనాను దెబ్బకొట్టిన అంతర్జాతీయ గిరాకీ తగ్గుదల
close

తాజా వార్తలు

Published : 29/06/2020 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాను దెబ్బకొట్టిన అంతర్జాతీయ గిరాకీ తగ్గుదల

బీజింగ్‌: ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటుందని భావించిన చైనాకు మరోసారి ఎదురుదెబ్బ తగలనుంది! కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ గిరాకీ తగ్గిన ప్రభావం దానిపై కనిపిస్తోంది. వరుసగా నాలుగో నెలైన జూన్‌లో వస్తూత్పత్తి (ఫ్యాక్టరీ ఔట్‌పుట్‌) పెరుగుతుందని భావించినప్పటికీ అలా జరగదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ మొదట చైనాలోని వుహాన్‌లో వెలుగు చూసింది. తాజాగా బీజింగ్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశ రాజధానికి 150 కిలోమీటర్ల దూరం వరకు పటిష్ఠ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో పరిశ్రమలేమీ నడవడం లేదు. తయారీ కొనుగోలు మేనేజర్స్‌‌ సూచీ (పీఎంఐ) మేలో 50.06 ఉండగా జూన్‌లో 50.4గా నమోదుకానుందని నిపుణులు అంటున్నారు. జులైలో మరింత తగ్గుతుందని రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో 29 మంది ఆర్థిక వేత్తలు అంచనావేశారు.

‘చైనా నిలకడగా స్థిరత్వం దిశగా పయనిస్తోంది. అయితే, కరోనా ముందునాటికి ఇప్పుటి పరిస్థితికి పోలికే లేదు. డిమాండ్‌ తగ్గడంతో కర్మాగారాలన్నీ తక్కువ మానవ వనరులతో నడుస్తున్నాయి’ అని యింగ్‌డా సెక్యూరిటీస్‌ పరిశోధకుడు హు యాన్‌హాంగ్‌ అన్నారు. మేలో చైనా ఎగుమతులు ఊహించిందాని కన్నా తక్కువగా 3.3% పడిపోయాయన్నారు. కరోనా వైద్యానికి సంబంధించిన పరికరాలకు ఉన్న డిమాండ్‌ కొంత రక్షించిందని పేర్కొన్నారు.

తయారీ రంగంపై తీవ్ర ఒత్తిడి పడటంతో చైనా వస్తు తయారీ ధరలు నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వస్తూత్పత్తి పెంచేందుకు చైనా భారీగా ఉద్దీపన పథకాలు ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎగుమతి సంస్థలపై దృష్టి సారించింది. కాగా, డ్రాగన్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని