కాగ్నిజెంట్‌ లాభంలో 17% క్షీణత
close

తాజా వార్తలు

Updated : 09/05/2020 04:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాగ్నిజెంట్‌ లాభంలో 17% క్షీణత

దిల్లీ: మార్చి త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ నికర లాభం 16.7 శాతం క్షీణించి 367 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2750 కోట్ల) కు పరిమితమైంది. మరో పక్క, త్రైమాసిక ఆదాయం 2.8 శాతం పెరిగి 4.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31,500 కోట్ల)కు చేరుకుంది. కొవిడ్‌-19 కారణంగా 2020 ఏడాదంతా గిరాకీకి సవాళ్లు ఎదురుకానున్నాయని కంపెనీ అంచనా వేసింది. ఈ కంపెనీ జనవరి-డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది.గతేడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 441 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3300 కోట్లు)గా ఉంది.  2020 ఏడాది అంచనాలను ఇప్పటికే కంపెనీ ఉపసంహరించుకుంది. కంపెనీకున్న మిశ్రమ వ్యాపార ధోరణి, బలమైన బ్యాలెన్స్‌ షీట్లు, ద్రవ్యలభ్యతలు కొవిడ్‌ సంక్షోభం నుంచి కాపాడతాయని ధీమా వ్యక్తం చేసింది.
20,000 నియామకాల కొనసాగింపు: గిరాకీ సవాళ్లకు తోడు ర్యాన్సమ్‌వేర్‌ కారణంగా 50-70 మిలియన్‌ డాలర్ల మేర ప్రభావం పడనుందని కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాదిలో డిజిటల్‌ నైపుణ్యాలు, వాణిజ్య బృందాలపై పెట్టుబడులను సంస్థ కొనసాగించనుంది. 20,000   ప్రారంభ స్థాయి నియామకాలనూ కొనసాగించనుంది. అయితే కార్పొరేట్‌ స్థాయిలో ప్రయాణ, మార్కెటింగ్‌, రీలొకేషన్‌ విషయంలో వ్యయ నియంత్రణ చేపట్టనుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని