తెలంగాణలో కరోనా @ ఒక్కరోజే 872
close

తాజా వార్తలు

Updated : 22/06/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కరోనా @ ఒక్కరోజే 872

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి‌ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 872 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8674కి చేరింది.

కొత్తగా ఏడు మరణాలు

ఈ రోజు మొత్తం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఏడుగురు మృత్యువాత పడటంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 217కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే, ఈ రోజు మరో 274మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 4005కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4452 మంది చికిత్స పొందుతున్నారు.  

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు

తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు నమోదవడం గమనార్హం. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 107 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇక జిల్లాల వారీగా వచ్చిన కేసుల్ని పరిశీలిస్తే.. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని