24గంటల్లో 11,502 కేసులు, 325 మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24గంటల్లో 11,502 కేసులు, 325 మరణాలు!

9520కి చేరిన కరోనా మరణాలు 

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత మూడురోజులుగా దేశంలో నిత్యం 11వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కొవిడ్-19 మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. కరోనా సోకిన వారిలో నిత్యం 300లకు పైగా బాధితులు మృత్యువాతపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 325మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకి మరణించిన వారిసంఖ్య 9520కి చేరింది. దేశంలో కరోనావైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకోగా మరో 1,53,106 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రస్తుతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న బాధితుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో రోజువారీగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు భారత్‌లోనే ఎక్కువగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. కొవిడ్‌ మరణాల్లో మాత్రం ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని