మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం
close

తాజా వార్తలు

Published : 11/05/2020 22:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. వైరస్‌ బారిన పడి ఇవాళ ఒక్క రోజే 36 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు 1236 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23,401కి చేరింది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 868కి చేరింది. ఇందులో 14,521 కేసుల ముంబయిలో నమోదవ్వగా మృతుల సంఖ్య 528గా ఉంది. గత 24గంటల్లో ముంబయిలో 20మంది మృతి చెందారు. 4,786మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

కర్ణాటకలోనూ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ 14 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 862కి చేరింది. ఇక గుజరాత్‌లో కొత్తగా 347 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,542కు చేరింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కొత్తగా 109 కేసులు నమోదు కాగా, మొత్తం 3,573గా నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 174 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 3,988కు చేరాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని